chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 10:02 pm Digital Edition : CHITTOORE EXPRESS

అంతర్జాతీయ షూటింగ్ బాల్ జట్టుకు నవీన్‌ ఎంపిక 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి17:

 

వేమనపల్లి వీర్నమల పంచాయతీకు చెందిన నవీన్‌ను ఇండియన్ షూటింగ్ బాల్ జట్టుకు ఎంపిక చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 25, 26 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జరిగిన 5వ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు నవీన్ సారథిగా వ్యవహరించాడు. ఆ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డును సాధించాడు. నవీన్ ప్రతిభను గుర్తించిన జాతీయ సెలెక్టర్లు అతనిని ఇండియన్ జట్టులోకి ఎంపిక చేశారు.ఈ నెల 22 నుంచి 24 వరకు ఇండియా-శ్రీలంక మధ్య జరిగే షూటింగ్ బాల్ సిరీస్‌లో ఇండియన్ టీంలో నవీన్ ప్రాతినిధ్యం వహిస్తానున్నాడు.నవీన్ ఎంపికపై షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ అంబా మహేష్, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ హర్షం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నోడల్ పీడీ శేఖర్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు జబీర్, రాజేష్, స్వాతి, లోకేష్, సరిత, రాజేష్, రాజకుమార్ పాల్గొన్నారు.